తాతయ్య .. బాబాయ్ ప్రభావం నాపై ఎక్కువ: కల్యాణ్ రామ్

  • 'బింబిసార' ప్రమోషన్స్ లో కల్యాణ్ రామ్
  • తాతగారి సినిమాలంటే ఇష్టమంటూ వ్యాఖ్య 
  • 'బింబిసార' విశేషాలు చాలానే ఉన్నాయంటూ వెల్లడి 
  • వచ్చేనెల 5వ తేదీన విడుదల కానున్న సినిమా 
Bombisara Movie Update

కల్యాణ్ రామ్ తన తాజా చిత్రమైన 'బింబిసార' సినిమాను ఆగస్టు 5వ తేదీన థియేటర్స్ కి తీసుకుని రానున్నాడు. ప్రస్తుతం ఆయన ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ .. "మొదటి నుంచి నాపై మా తాత గారు .. బాబాయ్ ప్రభావం ఎక్కువ. తాతయ్య గారి పౌరాణికాలు .. జానపదాలు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించేవి.

బాబాయ్ చేసిన 'భైరవద్వీపం' .. 'ఆదిత్య 369' సినిమాలంటే కూడా చాలా ఇష్టం. ఇక ఈ కాలం పిల్లలు 'ఐరన్ మేన్' .. 'స్పైడర్ మేన్' వంటి సినిమాలను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి సినిమాలను తెలుగులో కూడా తీస్తే బాగుంటుంది కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎక్కువగా తాతగారు .. బాబాయ్ చేసిన ప్రయోగాల గురించే ఆలోచించేవాడిని. 

అలాంటి పరిస్థితుల్లోనే వశిష్ఠ నా దగ్గరికి వచ్చి 'బింబిసార' కథను వినిపించాడు. కథ చాలా కొత్తగా .. ఇంతవరకూ నేను చేసిన సినిమాలకి భిన్నంగా అనిపించింది. అంతే.. అప్పటి నుంచి మా ప్రయాణం మొదలైంది. ఈ సినిమాకి సంబంధించిన విషయాలను మరో ఎపిసోడ్ లో చెబుతాను" అంటూ ముగించాడు.

More Telugu News