hcl tech: ఏడాదికి రూ. 123 కోట్లు.. దేశంలో అత్యధిక వేతన పారితోషికం అందుకున్న సీఈవో ఎవరంటే..!

  • హెచ్ సీఎల్ కంపెనీ సీఈవో విజయ్ కుమార్ ఘనత
  • కంపెనీ వార్షిక నివేదికలో వెల్లడించిన హెచ్ సీఎల్
  • ఈ మొత్తం దీర్ఘకాలిక ప్రోత్సాహం కిందే అందుకున్నట్టు వెల్లడి 
Meet the highest paid IT CEO in India and his annual package

ప్రముఖ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్ ఇటీవల విడుదల చేసిన వార్షిక నివేదికలో గత ఏడాది తమ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) సి.విజయ్‌కుమార్‌కు రూ.123.13 కోట్ల వేతనం అందించినట్లు పేర్కొంది. దీంతో విజయకుమార్ ప్రస్తుతం అత్యధిక వేతనం పొందుతున్న భారతీయ సీఈవోగా నిలిచారు. 

విజయకుమార్ ఆదాయంలో నాలుగింట మూడొంతులు దీర్ఘకాలిక ప్రయోజనాలతో పొందుపరచబడిందని కంపెనీ స్పష్టం చేసింది. తమ కంపెనీ నుంచి విజయకుమార్ ఎలాంటి వేతనం పొందలేదని, అయితే తమ అనుబంధ సంస్థ అయిన ‘హెచ్ సీఎల్ అమెరికా ఇంక్’ నుంచి దీర్ఘకాలిక ప్రోత్సాహకం సహా 16.52 మిలియన్ల డాలర్ల (రూ. 123. 13 కోట్లు) పారితోషికం అందుకున్నారని వార్షిక నివేదికలో పేర్కొంది.

 విజయకుమార్ వార్షిక మూల వేతనం రెండు మిలియన్లు కాగా, వేరియబుల్ పే కింద మరో మిలియన్ డాలర్లు పొందారని  తెలిపింది. మార్చి 31తో ముగిసిన సంవత్సరానికి ఆయన 0.02 మిలియన్ల మొత్తం ఇతర ప్రయోజనాలను పొందారు. హెచ్ సీఎల్ కంపెనీ దీర్ఘకాలిక ప్రోత్సాహం కింద అందించిన 12.50 మిలియన్ల మొత్తంతో ఆయన జీతం16.52 మిలియన్లకు (రూ. 123.13 కోట్లు) చేరుకుందని పేర్కొంది. 

‘12.5 మిలియన్ డాలర్ల దీర్ఘకాలిక ప్రోత్సాహకం అందుకోవడం మినహా 2021-22లో  ఆర్థిక సంవత్సరంలో విజయ్ కుమార్ వేతనంలో ఎటువంటి మార్పు లేదు. దీర్ఘకాలిక ప్రోత్సాహకం అనేది ఆయన చేరుకునే మైలురాళ్ల ఆధారంగా నిర్ణీత వ్యవధిలో (రెండు సంవత్సరాల ముగింపులో) చెల్లిస్తాం’ అని తెలిపింది. 

More Telugu News