Galla Jayadev: జనాభాతో సంబంధం లేకుండా జిల్లాకో కుటుంబ న్యాయస్థానం ఉండాలి: గల్లా జయదేవ్

  • కుటుంబ న్యాయస్థానాల సవరణ బిల్లుపై చర్చ
  • మౌలిక వసతుల లేమి న్యాయస్థానాల పనితీరును దెబ్బతీస్తోందని ఆవేదన
  • మనుగడలో లేని చట్టాల రద్దుకు కమిటీ వేయాలని సూచన
Galla Jayadev sought Family court in every dist

కుటుంబ న్యాయస్థానాల (సవరణ) బిల్లు-2022పై లోక్‌సభలో నిన్న జరిగిన చర్చలో టీడీపీ పార్లమెంటరీ నేత గల్లా జయదేవ్ మాట్లాడుతూ.. జనాభాతో సంబంధం లేకుండా ప్రతి జిల్లాలో ఓ కుటుంబ న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. సరైన మౌలిక వసతులు లేకపోవడం, న్యాయాధికారుల కొరత కారణంగా కుటుంబ న్యాయస్థానాల పనితీరు దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

అలాగే, అనవసరమైన, మనుగడలో లేని చట్టాల రద్దుకు ఓ కమిటీ వేయాలని కోరారు. ప్రస్తుత చట్టాల్లోని లోపాలను కూడా గుర్తించి అవసరమైన సవరణలను ఆ కమిటీ చేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రూ. 541.06 కోట్ల నిధులు కోరితే 14వ ఆర్థిక సంఘం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. 

వివాదాల పరిష్కారానికి కుటుంబ న్యాయస్థానాలు ఎన్జీవోల సాయం తీసుకోవాలని సూచించారు. న్యాయమూర్తుల నియామకంలో అర్హులైన సామాజిక కార్యకర్తలు, సామాజికవేత్తలను పరిగణనలోకి తీసుకోవాలని గల్లా జయదేవ్ సూచించారు.

More Telugu News