సరూర్ నగర్ లో రామ్ చరణ్ కొత్త చిత్రం షూటింగ్... అడ్డుకున్న బీజేపీ కార్పొరేటర్

26-07-2022 Tue 22:07 | Telangana
  • శంకర్, రామ్ చరణ్ కలయికలో భారీ చిత్రం
  • విక్టోరియా మెమోరియల్ స్కూల్లో షూటింగ్
  • బీజేపీ కార్యకర్తలతో షూటింగ్ ను అడ్డుకున్న ఆకుల శ్రీవాణి
  • క్లాసులు జరుగుతున్న సమయంలో షూటింగ్ ఏంటని ఆగ్రహం
BJP Corporator Akula Srivani obstructs Ram Charan new movie shooting in Hyderabad
స్టార్ డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ కాంబోలో భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కుతుండడం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులోని సరూర్ నగర్ లో జరుగుతుండగా, బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అడ్డుకున్నారు. 

ఇక్కడి విక్టోరియా మెమోరియల్ హోం స్కూల్లో కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తుండగా, బీజేపీ కార్యకర్తలతో కలిసి ఆకుల శ్రీవాణి అక్కడికి వచ్చారు. స్కూల్లో తరగతులు జరుగుతున్న సమయంలో షూటింగ్ కు అనుమతులు ఎలా ఇచ్చారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై ఆమె ధ్వజమెత్తారు. బాలలకు విద్యాబోధనను పక్కనబెట్టి సినిమా చిత్రీకరణకు అనుమతించడం ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వం ధనార్జనకే ప్రాధాన్యత ఇస్తోందని ఆమె విమర్శించారు.