Bernard N Marak: వ్యభిచార గృహం నడుపుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మేఘాలయ బీజేపీ ఉపాధ్యక్షుడి అరెస్ట్

  • తురాలో ఓ ఫాంహౌస్ పై పోలీసుల దాడులు
  • ఆరుగురు మైనర్లను కాపాడిన పోలీసులు
  • 73 మంది అరెస్ట్
  • ఉత్తర్ ప్రదేశ్ పారిపోయిన బెర్నార్డ్ ఎన్ మరాక్
Police arrests Meghalaya BJP Vice President Bernard N Marak in Uttar Pradesh

ఇటీవల మేఘాలయలోని తురాలో ఓ ఫాంహౌస్ పై దాడి చేసిన పోలీసులు అక్కడ వ్యభిచారం జరుగుతున్నట్టు గుర్తించారు. ఆరుగురు మైనర్ బాలికలను రక్షించిన పోలీసులు, 73 మందిని అరెస్ట్ చేశారు. కాగా, మేఘాలయ బీజేపీ ఉపాధ్యక్షుడు బెర్నార్డ్ ఎన్ మరాక్ ఇక్కడ వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్టు ఆరోపణలు రాగా, ఆయన రాష్ట్రం విడిచి పరారయ్యారు. 

తాజాగా, బెర్నార్డ్ ఎన్ మరాక్ ను ఉత్తరప్రదేశ్ లోని హాపూర్ జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఫాంహౌస్ పై దాడుల అనంతరం, మరాక్ ను విచారణకు సహకరించాలని కోరినా, అతడు నిరాకరించాడని పోలీసులు వెల్లడించారు. అతడు రాష్ట్రం వీడడంతో మేఘాలయ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. తురాలోని ఓ న్యాయస్థానం మరాక్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

More Telugu News