Telangana: మాజీ సర్పంచ్ మృత‌దేహాన్ని చూసి కంట‌త‌డి పెట్టిన తెలంగాణ స్పీక‌ర్ పోచారం

ts assembly speaker pocharam srinivas reddy wipes out at his followers dead body
  • అనారోగ్యంతో మృతి చెందిన వ‌ర్ని మాజీ స‌ర్పంచ్ వెంక‌టేశ్వ‌ర‌రావు
  • నివాళి అర్పించేందుకు వెళ్లి భావోద్వేగానికి గురైన పోచారం
  • బాధితుడి కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చిన స్పీకర్‌
తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస‌రెడ్డి... త‌న అనుచ‌ర వ‌ర్గంలోని ఓ నేత మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. నిజామాబాద్ జిల్లాలోని వ‌ర్ని మండ‌ల కేంద్రానికి చెందిన మాజీ స‌ర్పంచ్ బండ్ల వెంక‌టేశ్వ‌ర‌రావు అనారోగ్య కార‌ణాల‌తో మంగ‌ళ‌వారం మృతి చెందారు. 

ఈ వార్త తెలిసిన వెంట‌నే ఆయ‌న ఇంటికి వెళ్లిన పోచారం... వెంక‌టేశ్వ‌ర‌రావు మృత‌దేహాన్ని చూసి భావోద్వేగానికి గుర‌య్యారు. ఈ క్ర‌మంలో ఆయ‌న క‌న్నీళ్లు పెట్టుకున్నారు. అనంత‌రం త‌మాయించుకున్న పోచారం... వెంక‌టేశ్వ‌ర‌రావు కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చారు. ఆది నుంచి పోచారం అడుగు జాడ‌ల్లోనే న‌డిచిన వెంక‌టేశ్వ‌ర‌రావు బోధ‌న్ సీడీసీ చైర్మ‌న్‌గానూ వ్య‌వ‌హ‌రించారు.
Telangana
Nizamabad District
Varni
Pocharam Srinivas
TS Assembly Speaker

More Telugu News