Andhra Pradesh: వర్షంలోనే వరద బాధితులకు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మ‌ల సాయం... వీడియో ఇదిగో

tdp mla nimmala rama naidu distributes essentials to flood affected people
  • వ‌ర్షాల‌తో ఇంకా వ‌ర‌ద నీటిలోనే ప‌లు ప్రాంతాలు
  • ఇటీవ‌లే వ‌ర‌ద ప్రాంతాల్లో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌
  • చంద్ర‌బాబు పిలుపు మేర‌కు విరాళాలు సేక‌రించిన నిమ్మ‌ల‌
  • ఎన్టీఆర్ ట్ర‌స్ట్ త‌ర‌ఫున నిత్యావ‌స‌రాలు పంపిణీ చేస్తున్న వైనం
  • వ‌ర్షంలోనే గొడుగు ప‌ట్టుకుని ఇంటింటికీ తిరుగుతున్న టీడీపీ ఎమ్మెల్యే
రెండు వారాలుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు ఏపీలోని ఉమ్మ‌డి ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో వ‌ర‌ద పోటెత్తుతోంది. గోదావ‌రి వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న ప్రాంతాలు ఇప్పుడిప్పుడే వ‌ర‌ద నీటిలో నుంచి బ‌య‌ట‌ప‌డుతుండ‌గా... మంగ‌ళ‌వారం మ‌రోమారు వ‌ర్షం మొద‌లైంది. ఈ వ‌ర్షంలోనే త‌డుస్తూ టీడీపీ ఆధ్వ‌ర్యంలోని ఎన్టీఆర్ ట్ర‌స్ట్ త‌ర‌ఫున వ‌ర‌ద బాధితుల‌కు నిత్యావ‌స‌రాలు అందిస్తూ పాల‌కొల్లు ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడు సాగుతున్నారు. 

ఇటీవ‌లే వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకోవాల‌ని పార్టీ శ్రేణుల‌కు ఆయ‌న ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల మేర‌కు పార్టీ శ్రేణుల నుంచి విరాళాలు సేక‌రించిన నిమ్మ‌ల‌... ఆ నిధుల‌తో నిత్యావ‌స‌రాలు కొనుగోలు చేసి వ‌ర‌ద బాధితుల‌కు ఇంటింటికీ తిరుగుతూ పంపిణీ చేస్తున్నారు.
Andhra Pradesh
Floods
TDP
Nimmala Rama Naidu
Palakollu MLA
NTR Trust

More Telugu News