Rains: తెలంగాణలో మూడ్రోజుల పాటు వానలే... ఏపీలో రేపు విస్తారంగా వర్షాలు

  • తెలంగాణలో గత అర్ధరాత్రి భారీ వర్షాలు
  • నేడు, రేపు, ఎల్లుండి కూడా వర్షాలేనన్న వాతావరణ శాఖ
  • ఎల్లో అలర్ట్ జారీ.. ఏపీలో రేపటికి వర్షసూచన
Rain alert for Telangana and AP

తెలంగాణలో గత అర్థరాత్రి భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాదులో 100 మిమీ వర్షపాతం నమోదైంది. కాగా, మూడ్రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 

నేడు జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, ఖమ్మం, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, ములుగు, కరీంనగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. 

రేపు (జులై 27) ఉమ్మడి వరంగల్ జిల్లా, కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, జగిత్యాల, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, వికారాబాద్, పెద్దపల్లి, సిద్ధిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 

ఇక, ఏపీలో రేపు పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, విశాఖ, ఉభయగోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కడప, అన్నమయ్య జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశముందని ఐఎండీ వివరించింది.

More Telugu News