D. Srinivas: మాజీ మంత్రి డీఎస్ ఇప్పుడిలా ఉన్నారు!... ఫొటోను పోస్ట్ చేసిన వైఎస్ ష‌ర్మిల‌!

ys sharmila meets D Srinivas in hyderabad yesterday
  • రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత టీఆర్ఎస్‌లో చేరిన వైనం
  • రాజ్య‌స‌భ ప‌ద‌వీ కాలం ముగియ‌కుండానే టీఆర్ఎస్‌కు దూరంగా జ‌రిగిన మాజీ మంత్రి
  • ష‌ర్మిల‌తో భేటీ సంద‌ర్భంగా బ‌య‌టకొచ్చిన డీఎస్‌ ఫొటో
తెలుగు నేల రాజ‌కీయాల్లో డీఎస్‌గా ముద్ర‌ప‌డిన ధ‌ర్మ‌పురి శ్రీనివాస్ అలియాస్ డి.శ్రీనివాస్ చాలా కాలంగా బ‌య‌టికే రావ‌డం లేదు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత తెలంగాణ‌లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు పూర్తిగా మారిపోగా... కాంగ్రెస్‌ను వీడిన డీఎస్ అధికార టీఆర్ఎస్‌లో చేరారు. అదే పార్టీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ స‌భ్యుడిగానూ కొన‌సాగారు. గ‌త నెల 21న ఆ ప‌ద‌వీ కాలం కూడా ముగిసింది.

రాజ్య‌స‌భ ప‌ద‌వీ కాలం ముగియ‌కముందే టీఆర్ఎస్‌కు దూరంగా జ‌రిగిన డీఎస్‌... ఇప్పుడు ఏ పార్టీలోనూ లేన‌ట్టే లెక్క‌. సోమ‌వారం ఆయ‌న‌ను వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల క‌లిశారు. వైఎస్సార్ ఆప్తమిత్రులైన శ్రీనివాస్ గారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నానని, ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని షర్మిల సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అలాగే, ఈ సందర్భంగా వైఎస్సార్ తో తనకున్న అనుభవాలను ఆయన గుర్తు చేశారని షర్మిల తెలిపారు.    
D. Srinivas
Telangana
DS
Congress
YSRTP
YS Sharmila
Dharmapuri Srinivas

More Telugu News