Andhra Pradesh: అప్పు పుట్టిన ప్ర‌తి చోటా రుణాలు తీసుకుంటున్నారు... ఏపీ అప్పుల‌పై కేంద్రం వ్యాఖ్య‌

uninon government statement on ap debts in rajya sabha once again
  • 2022-23 ఏడాదిలో రూ.44,574 కోట్ల రుణాల‌కు ఏపీకి అనుమ‌తి
  • తొలి నెల‌లోనే రూ.21,890 కోట్ల రుణాన్ని తీసుకున్న రాష్ట్ర ప్ర‌భుత్వం
  • తొలి 3 నెల‌ల్లో ప‌రిమితిలో స‌గానికి పైగా రుణాల సేక‌ర‌ణ‌
  • టీడీపీ ఎంపీ క‌న‌క‌మేడల ప్ర‌శ్న‌కు కేంద్ర ఆర్థిక శాఖ స‌మాధానం
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న రుణాల‌పై కేంద్ర ప్ర‌భుత్వం మ‌రోమారు పార్ల‌మెంటు వేదిక‌గా వివరాలు పేర్కొంది. అప్పు పుట్టిన ప్ర‌తి చోటా రాష్ట్ర ప్ర‌భుత్వం రుణాలు తీసుకుంటోంద‌ని కేంద్రం వ్యాఖ్యానించింది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం రాజ్య‌స‌భ‌లో టీడీపీ ఎంపీ క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌కుమార్ అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్ర ఆర్థిక శాఖ స‌హాయ మంత్రి పంక‌జ్ చౌద‌రి లిఖిత‌పూర్వ‌క స‌మాధానం ఇచ్చారు. ఈ ఆర్థిక సంవ‌త్స‌రం మొత్తానికి అనుమ‌తించిన రుణాల్లో స‌గానికి పైగా రుణాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం తొలి 3 నెల‌ల్లోనే సేక‌రించింద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. 

2022-23 ఆర్థిక సంవ‌త్స‌రానికి నిక‌ర రుణ ప‌రిమితి కింద ఏపీకి రూ.44,574 కోట్ల రుణాల‌కు కేంద్రం అనుమ‌తించింద‌ని మంత్రి వివ‌రించారు. ఇందులో మొద‌టి 9 నెల‌ల‌కు గాను రూ.40,803 కోట్ల రుణం తీసుకునేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వానికి అనుమ‌తి ఉంద‌ని తెలిపారు. తొలి 3 నెల‌ల్లోనే రాష్ట్ర ప్ర‌భుత్వం 50 శాతానికి మించి అప్పులు తీసుకుంద‌న్నారు. అందులో ఏప్రిల్ నెల పూర్త‌య్యేనాటికే... అంటే ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభమైన తొలి నెల‌లోనే రూ.21,890 కోట్ల రుణాన్ని తీసుకుంద‌ని మంత్రి తెలిపారు.
Andhra Pradesh
YSRCP
YS Jagan
TDP
Kanakamedala Ravindra Kumar
Rajya Sabha
Ministry Of Finance

More Telugu News