Tollywood: పవన్ ‘హరిహర వీరమల్లు’ షెడ్యూల్ కి సన్నాహాలు!

Pawan kalyan latest movie HARIHARA shoot resume from August
  • పవన్ హీరోగా పీరియాడికల్ చిత్రం ‘హరిహర వీరమల్లు’
  • బందిపోటు పాత్రలో నటిస్తున్న పవర్ స్టార్
  • కరోనా, ఇతర కారణాలతో షూటింగ్ కు అంతరాయం
  • ఆగస్టు 11 నుంచి షూటింగ్ మొదలెట్టడానికి ప్లానింగ్ 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్‌‌‌‌లో తొలిసారి నటిస్తున్న పీరియాడికల్‌‌ చిత్రం ‘హరిహర వీరమల్లు’. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఎ.ఎమ్.రత్నం సమర్పణలో ఎ.దయాకర్‌‌‌‌ రావు నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఆయన లుక్ అందరినీ ఆకట్టుకుంది. పవన్‌‌కి జంటగా నిధి అగర్వాల్‌‌ నటిస్తోంది.

అంతాబాగానే ఉన్నా ఈ చిత్రం షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. తొలుత కరోనా కారణంగా చిత్రీకరణ ఆగిపోగా.. ఆపై పవన్ షెడ్యూల్ లో మార్పుల వల్ల కొంత గ్యాప్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై పవన్ ఇప్పుడు సీరియస్ గా దృష్టి పెట్టడంతో ఈ చిత్రం ఆపేశారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే, ఈ ప్రచారానికి చిత్ర బృందం ఇప్పుడు చెక్ పెట్టింది. 

ఆగస్టు 11 నుంచి చిత్రీకరణ తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. పవన్ పొలిటికల్ కమిట్ మెంట్లను దృష్టిలో ఉంచుకొని ఈ షెడ్యూల్ ను దర్శకుడు క్రిష్ పక్కాగా ప్లాన్ చేశారట. ఒక పాటతో పాటు పవన్ కళ్యాణ్‌‌ క్యారెక్టర్‌‌‌‌కి సంబంధించిన సీన్స్ మొత్తం ఈ షెడ్యూల్లోనే  పూర్తి చేయాలని భావిస్తున్నాడని సమాచారం. ఆ తర్వాత మిగతా వారి సీన్స్‌‌ని తెరకెక్కించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

ఈ సినిమాతో పాటు ‘వినోదాయ సిత్తం’ రీమేక్ కూడా పూర్తిచేసి రాజకీయాలపై ఫోకస్ పెట్టాలని పవన్ భావిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. హరీశ్ శంకర్‌‌‌‌తో ‘భవదీయుడు భగత్‌‌సింగ్‌‌’తో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమాకు పవన్ పచ్చజెండా ఊపారు.
Tollywood
Pawan Kalyan
krish
harihara veeramallu
shoot
resume

More Telugu News