Driver: కారుతో డివైడర్ ను దాటేద్దామనుకుంటే.. బెడిసి కొట్టింది!

Driver tries to perform car stunt ends up ramming divider in Himachals Solan
  • సినిమాల్లో మాదిరి విన్యాసాలకు దిగిన అమృత్ సర్ వాసి
  • 5వ నంబర్ జాతీయ రహదారిపై ర్యాష్ డ్రైవింగ్
  • డివైడర్ ను ఎక్కించబోగా పక్క లేన్ లోకి దూసుకుపోయిన కారు
కార్లతో విన్యాసాలను సినిమాల్లోనే చూస్తాం. హీరో కారుతో గాల్లోకి ఎగిరిపోయి మళ్లీ సురక్షితంగా ల్యాండ్ కావడం, ఎదురుగా లారీ వచ్చినా దానికి అందనంత ఎత్తుకు కారు ఎగిరి, తిరిగి కింద పడడం.. సినిమాలు చూసే వారికి ఈ సీన్ల గురించి బాగానే తెలుసు. నిజ జీవితంలో ఇవి ఆచరణ సాధ్యం కావని కూడా తెలుసు. కానీ, ఓ వ్యక్తి కారుతో సినిమాల్లో మాదిరే సాహస విన్యాసాలు చేద్దామని ప్రయత్నించి ఆసుపత్రి పాలయ్యాడు.

హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ జిల్లా పరిధిలో 5వ నంబర్ జాతీయ రహదారిపై అమృత్ సర్ కు చెందిన ఓ వ్యక్తి కారులో వెళుతున్నాడు. రాను, పోను వాహనాలకు వేర్వేరు లేన్స్ ఉండి, రోడ్డు మధ్యలో ఎత్తయిన డివైడర్ కూడా ఉంది. తన మార్గంలో వెళుతున్న సదరు వ్యక్తి ఒక్కసారిగా కారును కుడివైపునకు తిప్పి డివైడర్ ఎక్కించేశాడు. అది డివైడర్ ను బలంగా తాకి అవతలి వైపున్న మార్గంలోకి దూసుకుపోయింది. 

ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న వ్యక్తి గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కానీ, కారు మాత్రం బాగా డ్యామేజ్ అయింది. ధరంపూర్ పోలీస్ స్టేషన్ లో దీనిపై కేసు నమోదైంది. ర్యాష్ డ్రైవింగ్ తో విన్యాసాలకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.
Driver
perform
car stunt
ramming divider

More Telugu News