మోదీ బరువు తగ్గమన్నారని... జీపును ముందుకు నెడుతూ, వెనక్కి లాగుతూ తేజస్వి యాదవ్ కసరత్తులు... వీడియో ఇదిగో!

  • ఇటీవల బీహార్ లో పర్యటించిన మోదీ
  • తేజస్వి యాదవ్ తో సరదా సంభాషణ
  • అధిక బరువుతో ఉన్నావంటూ వ్యాఖ్యలు
  • అప్పటినుంచి తీవ్రంగా శ్రమిస్తున్న ఆర్జేడీ యువనేత
Tejaswi Yadav pull and push jeep to loss weight after PM Modi suggestion

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ లో పర్యటించారు. బీహార్ శాసనసభలో స్మారక భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్ తో మోదీ సరదాగా ముచ్చటించారు. బరువు తగ్గాలంటూ తేజస్వికి సూచించారు. ప్రధాని సూచనను సీరియస్ గా తీసుకున్న తేజస్వి వెంటనే రంగంలోకి దిగారు. కఠిన కసరత్తులతో బరువు తగ్గే కార్యక్రమం షురూ చేశారు. 

తనకిష్టమైన క్రికెట్ ఆడడమే కాదు, ఇటీవల ఓ జీప్ ను కూడా లాగారు. జీప్ ను ముందుకు నెడుతూ, వెనక్కి లాగుతూ ఒంట్లో క్యాలరీలను ఖర్చు చేసేందుకు శ్రమించారు. దీనికి సంబంధించిన వీడియోను తేజస్వి యాదవ్ కార్యాలయం సోషల్ మీడియాలో పంచుకుంది. 

32 ఏళ్ల తేజస్వి యాదవ్ గతంలో దేశవాళీ క్రికెటర్ అన్న సంగతి తెలిసిందే. ఝార్ఖండ్ తరఫున రంజీల్లో ఆడారు. అంతేకాదు, ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు రిజర్వ్ ఆటగాడిగా వ్యవహరించారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆటకు దూరమైన తేజస్వి బరువు పెరిగారు. ఈ విషయం గమనించే మోదీ బరువు తగ్గాలంటూ సూచన చేశారు.

More Telugu News