'ఈనాడు'లో అమిత్ షా వ్యాసం.. పోస్ట్ చేసిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్

25-07-2022 Mon 17:33
  • గిరిజ‌నుల అభ్యున్న‌తి కోసం బీజేపీ తీసుకున్న చ‌ర్య‌ల‌పై వ్యాసం
  • అట‌ల్ మొద‌లు మోదీ స‌ర్కారు చ‌ర్య‌ల ప్ర‌స్తావ‌న‌
  • క్లిప్పింగ్‌ను పంచుకున్న బీజేపీ ఎంపీ ల‌క్ష్మ‌ణ్‌
eenadu publishes a article of uninon home minister amit shah
బీజేపీ కీల‌క నేత‌, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్ర‌ముఖ తెలుగు దిన‌ప‌త్రిక ఈనాడులో ఓ వ్యాసం రాశారు. స‌ద‌రు వ్యాసాన్ని ఈనాడు ప‌త్రిక సోమ‌వారం నాటి త‌న సంచిక‌లో ప్ర‌చురించింది. ఎడిటోరియ‌ల్ పేజీలో అమిత్ షా రాసిన ఈ వ్యాసంలో... గిరిజ‌నుల అభ్యున్న‌తి కోసం బీజేపీ నేతృత్వంలోని అట‌ల్ బిహారీ వాజ్‌పేయితో పాటు ప్ర‌స్తుత భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తీసుకున్న చ‌ర్య‌ల‌ను అమిత్ షా ప్రస్తావించారు.

భార‌త రాష్ట్రప‌తిగా ద్రౌప‌ది ముర్ము సోమ‌వారం ప‌ద‌వీ ప్ర‌మాణం చేసిన సంగ‌తి తెలిసిందే. పార్ల‌మెంటులో అట్ట‌హాసంగా జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మాన్ని గుర్తు చేస్తూ అమిత్ షా ఈ వ్యాసాన్ని రాసిన‌ట్లుగా తెలుస్తోంది. ఈనాడు ఎడిటోరియ‌ల్ పేజీలో అమిత్ షా రాసిన వ్యాసాన్ని బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు కె.ల‌క్ష్మ‌ణ్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.