నా తమ్ముని కుమారుడు నారా రోహిత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు: చంద్ర‌బాబు

  • రోహిత్‌ను సినీ క‌థానాయ‌కుడిగా పేర్కొన్న చంద్ర‌బాబు
  • నారా రామ్మూర్తి నాయుడు కుమారుడే రోహిత్‌
  • టీడీపీకి వెన్నుద‌న్నుగా నిలుస్తున్న టాలీవుడ్ హీరో
ncbn girth day wishes to his brothers son nara rohith

టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ఇటీవ‌లి కాలంలో పార్టీకి చెందిన కీల‌క నేత‌ల‌తో పాటు ప‌లు రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల‌కు త‌న సోష‌ల్ మీడియా ఖాతాల ద్వారా బ‌ర్త్ డే విషెస్ చెబుతున్న సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా టాలీవుడ్ హీరోగా మారిన నారా రోహిత్‌కు ఆయ‌న సోమ‌వారం జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ సందర్భంగా నారా రోహిత్‌ను... త‌న త‌మ్ముడి కుమారుడిగానే కాకుండా సినీ క‌థానాయ‌కుడిగానూ చంద్ర‌బాబు పేర్కొన్నారు.

చంద్ర‌బాబు సోద‌రుడు నారా రామ్మూర్తి నాయుడు కుమారుడే నారా రోహిత్ అన్న విష‌యం తెలిసిందే. పెద‌నాన్న రాజ‌కీయాల్లో మెరుగ్గా రాణిస్తున్నా... నారా రోహిత్ మాత్రం సినీ రంగాన్ని ఎంచుకున్నారు. అవకాశం చిక్కిన ప్ర‌తిసారీ పెద‌నాన్న‌కు, పెద‌నాన్న కుమారుడు నారా లోకేశ్‌కు, వారి ఆధ్వ‌ర్యంలోని టీడీపీకి వెన్నుద‌న్నుగా నిలుస్తూ నారా రోహిత్ సాగుతున్న వైనం తెలిసిందే.

More Telugu News