Gummanuru Jayaram: రోడ్లు వేయకపోవడానికి కారణం ఇదే: ఏపీ మంత్రి జయరాం

  • ఆలూరు నియోజకవర్గంలో 40 రోడ్లు పాడయ్యాయన్న మంత్రి  
  • నిధులు లేక ముత్తుకూరు రోడ్డు పూర్తి కాలేదని వివరణ 
  • ఆగస్టులో రూ. 2 వేల కోట్లు వస్తాయని సీఎం చెప్పారన్న జయరాం 
Roads not laid because of lack of funds says minister Jayaram

ఏపీలో పలు చోట్ల రోడ్ల పరిస్థితి బాగోలేదని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్ల పరిస్థితి మరింత దారుణంగా తయారయింది. ఈ నేపథ్యంలో ఏపీ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ముత్తుకూరు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిధులు లేకపోవడం వల్లే ముత్తుకూరు రోడ్డు పూర్తి కాలేదని తెలిపారు. ఆలూరు నియోజకవర్గంలో 40 రోడ్లు పాడయ్యాయని చెప్పారు. ఆగస్ట్ నెలలో రూ. 2 వేల కోట్లు వస్తాయని ముఖ్యమంత్రి జగన్ చెప్పారని... నిధులు రాగానే ఆగస్ట్ 15 తర్వాత రోడ్ల రిపేర్లకు సంబంధించి పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామని ప్రజలకు వివరించారు.

More Telugu News