నేటి నుంచే ఒప్పో రెనో 8 విక్రయాలు

  • ఫ్లిప్ కార్ట్ ప్లాట్ ఫామ్ పై ప్రారంభం
  • ఒప్పో రెనో 8 ధర రూ.29,999
  • రెనో 8 ప్రో ధర రూ.45,999
  • హెచ్ డీఎఫ్ సీ, ఎస్ బీఐ, ఐసీఐసీఐ, కోటక్ కార్డులపై తగ్గింపు
Oppo Reno 8 goes on sale today on Flipkart

ఒప్పో రెనో 8, రెనో 8 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ల విక్రయాలు సోమవారం నుంచి ఫ్లిప్ కార్ట్ లో మొదలయ్యాయి. ఈ రెండు ఫోన్లతోపాటు ఎయిర్ పాడ్స్ అయిన ఎంకో ఎక్స్2ను గత వారం ఒప్పో ఆవిష్కరించింది. ఈ ఫోన్ల కొనుగోలుపై పలు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు, కోటక్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులపై కొనుగోలు చేస్తే తగ్గింపు పొందొచ్చు. 

ఒప్పో రెనో 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ ధర రూ.29,999. షిమ్మర్ బ్లాక్, షిమ్మర్ గోల్డ్ రంగుల్లో లభిస్తోంది. ఒప్పో రెనో 8 ప్రో 12 జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీ ధర రూ.45,999. ఐసీఐసీఐ, ఎస్ బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ.3,000 తగ్గింపు లభిస్తుంది. 

ఒప్పో రెనో 5జీ ఫోన్లో 5.4 అంగుళాల అమోలెడ్ ప్యానెల్, 90 హెర్జ్ రీఫ్రెష్ రేటు, మీడియాటెక్ డైమిన్సిటీ 1300 ప్రాసెసర్, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా, ఇందులో 50 మెగా పిక్సల్ సోనీ కెమెరా లెన్స్, సెల్ఫీల కోసం 32 మెగాపిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు. 

ఒప్పో రెనో 8ప్రో 5జీ ఫోన్లో కొన్ని మెరుగైన ఫీచర్లు ఉంటాయి. 6.70 అంగుళాల డిస్ ప్లే, 120 హెర్జ్ రీఫ్రెష్ రేటు, గొరిల్లాగ్లాస్ 5 ప్రొటెక్షన్, మీడియాటెక్ 8100 ప్రాసెసర్, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ సదుపాయంతో వస్తుంది. కెమెరాలు రెనో 8 లో మాదిరే ఉంటాయి.

More Telugu News