KCR: సాయంత్రం ఢిల్లీకి వెళ్తున్న సీఎం కేసీఆర్

KCR going to Delhi
  • సాయంత్రం ప్రత్యేక విమానంలో వెళ్లనున్న కేసీఆర్
  • రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్న సీఎం
  • రాష్ట్రపతి ముర్మును కలిసి శుభాకాంక్షలు తెలియజేయనున్న కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ సాయంత్రం ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు. రెండు రోజుల పాటు ఆయన దేశ రాజధానిలోనే గడపనున్నారు. భారత 15వ రాష్ట్రపతిగా బాధ్యతలను స్వీకరించిన ద్రౌపది ముర్మును ఆయన మర్యాద పూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. 

మరోవైపు విపక్షాలకు చెందిన కొందరు కీలక నేతలను కూడా ఆయన కలవనున్నారు. జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు. కేసీఆర్ తో పాటు కొందరు మంత్రులు కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు కేసీఆర్ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.  
KCR
TRS
Delhi
drau

More Telugu News