Sam NorthEas: 21వ శతాబ్దంలోనే అత్యధిక స్కోరు.. కౌంటీల్లో క్వాడ్రపుల్ సెంచరీ సాధించిన శామ్

Glamorgans Sam Scores 410 Registers Highest Score Of 21st Century
  • సిక్సర్‌తో క్వాడ్రపుల్ సెంచరీ సాధించిన శామ్
  • ఫస్ట్‌క్లాస్ క్రికెట్ చరిత్రలో 400కు పైగా స్కోరు సాధించిన 11వ బ్యాటర్‌గా రికార్డు
  • 1994లో వార్విక్‌షైర్ తరపున 501 పరుగులు చేసిన లారా

ఇంగ్లిష్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో కనీవినీ ఎరుగని రికార్డు నమోదైంది. గ్లామోర్గాన్‌కు చెందిన శామ్ నార్త్‌ఈస్ట్.. లీసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 410 సాధించి అజేయంగా నిలిచాడు. 32 ఏళ్ల శామ్ సిక్సర్‌తో 400 పరుగుల మైలురాయిని చేరుకోవడం విశేషం. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఇది ఆల్‌టైమ్ 9వ స్కోరు. శామ్ క్వాడ్రపుల్ సెంచరీతో గ్లామోర్గాన్ జట్టు ఐదు వికెట్ల నష్టానికి 795 పరుగులు చేసింది. కాగా, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌ చరిత్రలో 400కు పైగా స్కోరు సాధించిన 11వ వ్యక్తిగా శామ్ రికార్డులకెక్కాడు. అంతేకాదు, 21వ శతాబ్దంలోనే ఇది అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఇంగ్లండ్ గడ్డపై మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు కూడా ఇదే.

1994లో వార్విక్‌షైర్ తరపున విండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా డర్హమ్‌లో 501 పరుగులు చేసి రికార్డునెలకొల్పాడు. లారా, ఆస్ట్రేలియాకు చెందిన బిల్ పాన్స్‌పోర్ట్ రెండుసార్లు 400 మార్క్ ఘనత సాధించారు. ఇంగ్లండ్‌తో జరిగిన అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లోనూ లారా అజేయంగా 400 పరుగులు చేశాడు. అంతర్జాతీయంగా ఆ ఘనత సాధించిన ఒకే ఒక్కడుగా లారా రికార్డులకెక్కాడు.

  • Loading...

More Telugu News