Ravi Kishan: లోక్‌సభలో జనాభా నియంత్రణ బిల్లును ప్రవేశపెడతానన్న నటుడు, ఎంపీ రవికిషన్.. ఆడుకుంటున్న నెటిజన్లు!

  • ఒక జంట ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ కనకూడదన్న రవికిషన్
  • ఇలాగైతే మనం విశ్వగురువులం కాలేమని ఆవేదన
  • ప్రైవేటు బిల్లుకు అన్ని పార్టీలు సహకరించాలన్న ఎంపీ
  • మీరు నలుగురు పిల్లల్ని ఎందుకు కన్నారంటూ నెటిజన్ల ప్రశ్న
Actor BJP MP Ravi Kishan Calls For Population Control Bill

ఒక జంట ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లల్ని కనకుండా నిరోధించేలా పార్లమెంటులో ప్రైవేటు బిల్లు ప్రవేశపెడతానన్న ప్రముుఖ నటుడు, ఎంపీ రవికిషన్‌ను నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. రవికిషన్ తాజాగా మాట్లాడుతూ.. ప్రస్తుతం మనం జనాభా విస్ఫోటనం దిశగా వెళ్తున్నామని, ఇలాగైతే మనం విశ్వగురువులం ఎన్నటికీ కాలేమని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా నియంత్రణ అత్యంత అవసరమని, కాబట్టి తాను పార్లమెంటులో ప్రవేశపెట్టే జనాభా నియంత్రణ ప్రైవేటు బిల్లుకు అన్ని పార్టీలు సహకరించాలని కోరారు.

రవికిషన్ ఈ వ్యాఖ్యలు చేశారో, లేదో నెటిజన్లు రంగంలోకి దిగిపోయారు. ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఒక జంటకు ఇద్దరి కంటే ఎక్కువమంది సంతానం ఉండకూడదంటున్న మీరు చేసిందేంటని ప్రశ్నిస్తున్నారు. రవికిషన్‌కు నలుగురు సంతానం. అందులో ముగ్గురు అమ్మాయిలు కాగా, ఓ అబ్బాయి కూడా ఉన్నాడు. వీరిలో అబ్బాయికి అందరికంటే చిన్నవాడు కావడం గమనార్హం.

జనాభా నియంత్రణ కోసం ప్రైవేటు బిల్లు తెస్తానంటున్న మీరు చేసిన పనేంటని ఎంపీని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కుమారుడు పుట్టేంత వరకు పిల్లల్ని కంటూనే ఉన్న మీరు జనాభా నియంత్రణకు ప్రైవేటు బిల్లు పెడతాననడం హాస్యస్పందంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, వచ్చే ఏడాది నాటికి జనాభాలో చైనాను దాటేసి భారత్ అగ్రస్థానానికి చేరుకుంటుందని ఐక్యరాజ్యసమితి ఇటీవల అంచనా వేసింది.

More Telugu News