Bhagwant Mann: చెత్త పారబోశారంటూ పంజాబ్ సీఎం ఇంటికి రూ.10 వేల జరిమానా

Ten thousand rupees fine for Punjab CM residence for dumping waste
  • చండీగఢ్ లో భగవంత్ మాన్ నివాసం వెలుపల చెత్త
  • స్థానికుల నుంచి ఫిర్యాదులు
  • పలుమార్లు హెచ్చరించిన మున్సిపల్ శాఖ
  • భారీ జరిమానా వడ్డన
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ నివాసానికి భారీ జరిమానా విధించారు. చెత్త పారబోశారంటూ చండీగఢ్ లోని సీఎం భగవంత్ మాన్ నివాసానికి రూ.10 వేల జరిమానా వడ్డించారు. సీఆర్పీఎఫ్ బెటాలియన్ డిప్యూటీ సూపరింటిండెంట్ హర్జీందర్ సింగ్ పేరిట ఈ మేరకు చలాన్ జారీ అయింది. ఇందులో పంజాబ్ సీఎం ఇంటి చిరునామా స్పష్టంగా పేర్కొన్నారు. 

దీనిపై స్థానిక బీజేపీ కౌన్సిలర్ మహేశిందర్ సింగ్ సిద్ధు స్పందిస్తూ, సీఎం నివాసం నుంచి చెత్త పారబోస్తున్నారంటూ స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. చెత్తను రోడ్డు మీద పారవేయొద్దని సీఎం నివాసంలోని వారికి మున్సిపల్ సిబ్బంది పలుమార్లు చెప్పినా ఫలితం కనిపించలేదని వివరించారు. ఈ క్రమంలోనే చలాన్ జారీ అయిందని వెల్లడించారు.
Bhagwant Mann
Residence
Fine
Waste
Chandigarh
Punjab

More Telugu News