Ambati Rambabu: వరద బాధితుల పరామర్శకు టీడీపీ జెండాలతో వెళతారా? సిగ్గుచేటు కాదా?: చంద్రబాబుపై అంబటి విమర్శలు

Ambati Rambabu criticizes Chandrababu tour in flood hit areas
  • కోనసీమ జిల్లాలో చంద్రబాబు పర్యటన
  • వరద బాధితులకు పరామర్శ
  • చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారన్న మంత్రి 
టీడీపీ అధినేత చంద్రబాబు కోనసీమ జిల్లాలో పర్యటించి గోదావరి వరద బాధితులను పరామర్శించడం తెలిసిందే. దీనిపై ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. వరద బాధితుల పరామర్శకు ఎవరైనా పార్టీ జెండాలతో వెళతారా? అంటూ ప్రశ్నించారు. వరద బాధితుల వద్దకు చంద్రబాబు టీడీపీ జెండాలతో వెళ్లడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. ఓవైపు వరద బాధితుల ఇబ్బందులు చూడకుండా, చంద్రబాబు పార్టీ జెండాలతో, కార్యకర్తలతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. 

ఈ ఏడాది వరదలు ఎంతో ముందుగా వచ్చాయని తెలిపారు. జగన్ పాలనలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని, చంద్రబాబు పాలనలో వర్షాలే లేవని అన్నారు. అసలు, చంద్రబాబు పాలనలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తడమే జరగలేదని వెల్లడించారు. చంద్రబాబు అహంభావం వల్లే పోలవరం నిర్మాణం ఆలస్యమైందని, ఎవరైనా కాఫర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రం వాల్ నిర్మిస్తారా? అని అంబటి రాంబాబు నిలదీశారు. డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడం టీడీపీ తప్పిదమేనని స్పష్టం చేశారు.
Ambati Rambabu
Chandrababu
Dr BR Ambedkar Konaseema District
Flood
YSRCP
TDP

More Telugu News