TTD: తిరుత్తణి శ్రీ సుబ్రమణ్యేశ్వ‌రుడికి తిరుమ‌ల వెంక‌న్న ప‌ట్టు వ‌స్త్రాలు... ఫొటోలు ఇవిగో

yv subbareddy presents ttd pattu vastram to subrahmaneswara swamy in thiruttani
  • త‌మిళ‌నాడులోని తిరుత్త‌ణిలో ఉత్స‌వాలు
  • స‌తీస‌మేతంగా ఉత్సవాల‌కు హాజ‌రైన వైవీ సుబ్బారెడ్డి
  • పద్మగిరి బాల జ్ఞాన దండాయుధపాణి స్వామికి చెవిరెడ్డి ప‌ట్టువస్త్రాల స‌మ‌ర్ప‌ణ‌
ఆడికృత్తిక సందర్భంగా శ‌నివారం తమిళనాడులోని తిరుత్తణి శ్రీ సుబ్రమణ్య స్వామి ఉత్స‌వాలు మొద‌ల‌య్యాయి. ఈ వేడుకల్లో భాగంగా సుబ్ర‌హ్మ‌ణ్వేశ్వ‌ర స్వామికి తిరుమ‌ల శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామి త‌ర‌ఫున‌ టీటీడీ పట్టువస్త్రాలు సమర్పించారు. టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి స‌తీస‌మేతంగా హాజరై ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. కరోనా నుంచి దేశం విముక్తి పొంది ప్రజలంతా సుభిక్షంగా ఉండేలా ఆశీర్వదించాలని శ్రీ సుబ్రమణ్య స్వామిని ప్రార్థించిన‌ట్లు ఆ త‌ర్వాత సుబ్బారెడ్డి తెలిపారు.

ఇదిలా ఉంటే ఆడికృత్తిక కావడి మహోత్సవ వేడుక సందర్భంగా తనపల్లిలోని శ్రీ పద్మగిరి బాల జ్ఞాన దండాయుధపాణి స్వామి వారికి చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంత‌రం భ‌క్తుల‌కు అన్న‌దాన కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాలుపంచుకున్నారు.
TTD
YSRCP
YV Subba Reddy
Chevireddy Bhaskar Reddy
Tamilnadu
Thiruttani

More Telugu News