Sharmila: రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు చేపట్టినా మెగా కృష్ణారెడ్డికే ఎందుకు ఇస్తున్నారు?: షర్మిల

  • తెలంగాణ ప్రభుత్వంపై షర్మిల ఫైర్
  • మెగా కృష్ణారెడ్డిపై కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోవడంలేదన్న షర్మిల
  • ఇద్దరూ తోడుదొంగలనా? అంటూ ఆగ్రహం
  • బండి సంజయ్, రేవంత్ రెడ్డిపైనా షర్మిల వ్యాఖ్యలు
Sharmila fires on Telangana govt

తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు చేపట్టినా మెగా కృష్ణారెడ్డికే ఎందుకు ఇస్తున్నారంటూ నిలదీశారు. మా తెలంగాణ వాళ్లకి కాంట్రాక్ట్ పనులు చేయడం రాదా? లేక ఇద్దరూ కలిసి ప్రజాధనాన్ని దోచుకోవచ్చనా? అంటూ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. 

మెగా కృష్ణారెడ్డి రూ.70 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డాడని, నల్లధనం ఉందని, దీనికి సంబంధించి రూ.12 వేల కోట్ల జీఎస్టీ కట్టాల్సి ఉందని స్వయంగా జీఎస్టీ ఇంటెలిజెన్స్ చెబుతున్నా కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇద్దరూ తోడుదొంగలనా? అంటూ మండిపడ్డారు. 

"ఈ విషయంపై బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడంలేదు? మెగా కృష్ణారెడ్డి మీకు కూడా దోస్తు కాబట్టి, మీకు ముడుపులు అందుతున్నాయి కాబట్టి మాట్లాడడంలేదా?" అంటూ ఇతర విపక్ష నేతలను సైతం షర్మిల ప్రశ్నించారు.

More Telugu News