Crocodiles: వరదలతో వడోదర వాసులను భయపెట్టిన మొసళ్లు

Crocodiles enter residential areas in Vadodara due to heavy rainfall
  • భారీ వర్షాలతో విశ్వామిత్ర నదికి వరదలు
  • పొంగి ప్రవహించిన నది
  • నది నుంచి బయటకు కొట్టుకువచ్చిన మొసళ్లు
  • అపార్ట్ మెంట్ ఆవరణల్లోకి ప్రవేశం
గుజరాత్ లోని వడోదర వాసులను మొసళ్లు వణికించాయి. ఇటీవలి భారీ వర్షాలతో విశ్వామిత్ర నది పొంగి ప్రవహించింది. విశ్వామిత్ర నది 250 మొసళ్లకు ఆశ్రయమిస్తోంది. నదికి వరదలు రావడంతో ఆ నీరు వడోదరలోని లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. నీటితోపాటు మొసళ్లు కూడా పట్టణంలోకి కొట్టుకువచ్చాయి. అపార్ట్ మెంట్ వాసులు.. తమ ఇంటి ఆవరణలోకి మొసళ్లు వచ్చాయంటూ అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. 

 దాంతో వాటిని పట్టుకునేందుకు పలు బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇలా కొట్టుకువచ్చిన మొసళ్లలో చిన్నవి, పెద్దవి కూడా ఉన్నాయి. డ్రైనేజీల్లో ఎన్నో కిలోమీటర్ల మేర అవి కొట్టుకుపోయాయి. రంగంలోకి దిగిన అటవీ సిబ్బంది పలు ప్రాంతాల్లో మొసళ్లను బంధించి తీసుకెళ్లారు.
Crocodiles
entered
residences
vadodara
gujarat

More Telugu News