Naga Chaitanya: ఒక వ్యక్తిగా ఎంతో మారిపోయాను.. చాలా సంతోషంగా ఉన్నా: నాగ చైతన్య

I am very happy says  Naga Chaitanya
  • విడాకుల తర్వాత ఎంతో సంతోషంగా ఉన్నానన్న చైతూ
  • కుటుంబం, స్నేహితులతో ఎక్కువగా గడుపుతున్నానని వ్యాఖ్య
  • తనలో ఒక కొత్త వ్యక్తిని చూసుకోవడం సంతోషంగా ఉందన్న చైతూ
టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత, నాగ చైతన్య విడిపోయి చాలా రోజులు అవుతోంది. అయినప్పటికీ వీరికి సంబంధించిన ఏ చిన్న వార్త అయినా వైరల్ అవుతోంది. బాలీవుడ్ లో సెటిల్ అయ్యేందుకు సమంత తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. 

తాజాగా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తో కలిసి 'కాఫీ విత్ కరణ్' షోలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్యను భర్తగా కరణ్ జొహార్ సంబోధించగా... మధ్యలో అందుకుని.. 'ఆయన తన భర్త కాదని, మాజీ భర్త అని' సమంత కరెక్ట్ చేసింది. మరోవైపు విడాకుల తర్వాత తన జీవితం గురించి నాగచైతన్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

బాలీవుడ్ లైఫ్ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతూ మాట్లాడుతూ.. విడాకుల తర్వాత ఒక వ్యక్తిగా తన జీవితం ఎంతో మారిందని చెప్పాడు. గతంలో తాను ఏ విషయం గురించి ఎక్కువగా మాట్లాడేవాడిని కాదని తెలిపాడు. ఇప్పుడు తన కుటుంబం, స్నేహితులతో ఎక్కువగా గడుపుతున్నానని తెలిపాడు. తనలో తాను కొత్త వ్యక్తిని చూసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు.
Naga Chaitanya
Samantha
Tollywood

More Telugu News