YSRCP: ఈ నెల 26 నుంచి వ‌ర‌ద ప్రాంతాల్లో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌

ap cm ys jagan tour in flood affected areas on 26th of this month
  • ఈ నెల 27న కూడా కొన‌సాగ‌నున్న జ‌గ‌న్ టూర్‌
  • రాజోలు, పి.గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌ట‌న‌
  • వ‌ర‌ద ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి ప‌రిశీల‌న‌
ఏపీలోని ఉభ‌య గోదావ‌రి జిల్లాల ప‌రిధిలోని గోదావ‌రి ప‌రీవాహ ప్రాంతాలు వ‌ర‌ద‌లో మునిగిన సంగ‌తి తెలిసిందే. వ‌ద‌ర ప్ర‌భావిత ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌కు ఇప్ప‌టికే ప‌రిహారం, నిత్యావ‌స‌రాల‌ను పంపిణీ చేసిన ఏపీ ప్ర‌భుత్వం... వ‌ర‌ద ప‌రిస్థితుల‌ను ప‌రిశీలిస్తోంది. ఈ క్ర‌మంలో వ‌ర‌ద క్ర‌మంగా త‌గ్గుతున్న నేప‌థ్యంలో ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి ఈ నెల 26 నుంచి వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో పర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరుతున్నారు. 

ఈ నెల 26న వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల ప‌రిశీల‌న‌కు వెళ్ల‌నున్న జ‌గ‌న్‌...  ఆ మ‌రునాడు కూడా వ‌ర‌ద ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం. రాజోలు, పి. గన్నవరం నియోజకవర్గాల్లోని లంక ప్రాంతాల్లో సీఎం ప‌ర్య‌ట‌న సాగుతుందని ప్రాథమిక స‌మాచారం. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేయ‌డంతో పాటుగా వ‌ర‌ద బాధితుల‌తో మాట్లాడేందుకే జ‌గ‌న్ ఈ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరుతున్నారు.
YSRCP
Andhra Pradesh
YS Jagan
Floods

More Telugu News