31 కేజీబీవీల్లో 20 తెలంగాణ‌కే కేటాయించిన కేంద్ర ప్ర‌భుత్వం

22-07-2022 Fri 20:17
  • దేశ‌వ్యాప్తంగా 4,982 కేజీబీవీలు
  • 696 కేంద్రాల‌తో దేశంలోనే రెండో స్థానంలో తెలంగాణ‌
  • తాజా కేటాయింపుల‌పై బీజేపీ తెలంగాణ శాఖ ట్వీట్‌
20 kgbvs allotted to telangana out of 31
క‌స్తూర్బా గాంధీ బాలికా విద్యాల‌య(కేజీబీవీ) ల కేటాయింపులో తెలంగాణ‌కు కేంద్రం పెద్ద పీట వేసింది. శుక్ర‌వారం దేశంలోని వివిధ రాష్ట్రాల‌కు 31 కేజీబీవీల‌ను ప్ర‌క‌టించిన కేంద్ర ప్ర‌భుత్వం... వాటిలో తెలంగాణ‌కే 20 కేంద్రాల‌ను కేటాయించ‌డం గ‌మ‌నార్హం. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించిన బీజేపీ తెలంగాణ శాఖ కేజీబీవీల్లో తెలంగాణ‌కు అగ్ర తాంబూలం ల‌భించింద‌ని పేర్కొంది.

తాజాగా ప్ర‌క‌టించిన 31 కేజీబీవీల‌ను క‌లుపుకుని దేశ‌వ్యాప్తంగా 4,982 విద్యాల‌యాలు ఉంటే...వాటిలో 696 ఒక్క తెలంగాణ‌లోనే ఉన్నాయని బీజేపీ తెలిపింది. వెర‌సి అత్య‌ధిక సంఖ్య‌లో కేజీబీవీల‌ను క‌లిగిన రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింద‌ని కూడా ఆ పార్టీ తెలిపింది.