Hyderabad: హైద‌రాబాద్‌లో గ‌న్‌తో కాల్చుకుని క‌డ‌ప న్యాయ‌వాది ఆత్మ‌హ‌త్య‌

kadapa lawyer commits suicide in hyderabad
  • తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా ప‌నిచేస్తున్న శివారెడ్డి
  • శివారెడ్డి వ‌ద్ద లైసెన్స్‌డ్ గ‌న్ ఉన్న వైనం
  • కాల్చుకున్న వెంట‌నే చ‌నిపోయిన బాధితుడు
హైద‌రాబాద్, చిక్క‌డ‌ప‌ల్లిలో ఈ రోజు కాల్పుల క‌ల‌క‌లం చోటుచేసుకుంది. ఏపీలోని క‌డ‌ప జిల్లాకు చెందిన న్యాయ‌వాది శివారెడ్డి తుపాకీతో కాల్చుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. క‌డ‌ప జిల్లాకు చెందిన శివారెడ్డి హైద‌రాబాద్‌లోని తెలంగాణ హైకోర్టులోనే న్యాయ‌వాదిగా ప్రాక్టీస్ చేస్తున్న‌ట్లుగా స‌మాచారం. 

శ‌నివారం త‌న వ‌ద్ద ఉన్న లైసెన్స్‌డ్ గ‌న్‌తో కాల్చుకుని ఆయ‌న ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో శివారెడ్డి అక్క‌డికక్క‌డే మృతి చెందారు. దీనిపై స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకుని దర్యాప్తు మొద‌లుపెట్టారు.
Hyderabad
Telangana
Kadapa District
Andhra Pradesh
Lawyer
TS High Court

More Telugu News