Telangana: మ‌రో 2,440 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ఆర్థిక శాఖ అనుమ‌తి

ts finance department approves to fill up 2440 posts
  • అధిక భాగం పోస్టులు విద్యా శాఖ ప‌రిధిలోనివే
  • పురావ‌స్తు శాఖ‌లో 14 ఖాళీల భ‌ర్తీకి అనుమ‌తి
  • త్వ‌ర‌లోనే వెలువ‌డ‌నున్న నోటిఫికేష‌న్లు
తెలంగాణ‌లో ఉద్యోగాల భర్తీకి వ‌రుస‌గా నోటిఫికేష‌న్లు జారీ అవుతున్నాయి. తాజాగా విద్యా శాఖ‌, పురావ‌స్తు శాఖ‌ల్లోని 2,440 ఖాళీల భ‌ర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ శుక్ర‌వారం అనుమ‌తి మంజూరు చేసింది. దీంతో త్వ‌ర‌లోనే ఈ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు జారీ కానున్నాయి. తాజాగా ఆర్థిక శాఖ అనుమ‌తి పొందిన ఖాళీల భ‌ర్తీలో కింద ఉద్యోగాలు ఉన్నాయి.

విద్యా శాఖ ప‌రిధిలో 1,392 జూనియ‌ర్ లెక్చ‌రర్లు, ఇంట‌ర్మీడియ‌ట్ విద్యా విభాగంలో 40 లైబ్రేరియ‌న్లు, 91 ఫిజిక‌ల్ డైరెక్ట‌ర్ పోస్టులు, పాలిటెక్నిక్ క‌ళాశాలల్లో 247 లెక్చ‌ర‌ర్లు, 14 ఇన్‌స్ట్ర‌క్ట‌ర్‌, 31 లైబ్రేరియ‌న్‌, 5 మ్యాట్ర‌న్‌, 25 ఎల‌క్ట్రీషియ‌న్‌, 37 ఫిజిక‌ల్ డైరెక్ట‌ర్ పోస్టుల భ‌ర్తీకి అనుమ‌తి ల‌భించింది. ఇక పురావ‌స్తు శాఖ‌లో 14 ఖాళీలు, కళాశాల విద్యా విభాగంలో 491 లెక్చ‌రర్లు, 24 లైబ్రేరియ‌న్‌, 29 ఫిజిక‌ల్ డైరెక్ట‌ర్ పోస్టుల భ‌ర్తీకి అనుమ‌తి ల‌భించింది.
Telangana
Finance Department
Notifications

More Telugu News