Yediyurappa: అవినీతి కేసులో యడియూరప్పకు పెద్ద ఊరటను కలిగించిన సుప్రీంకోర్టు

  • భూ కుంభకోణం కేసులో యెడ్డీకి ఊరట
  • 2013లో నమోదైన అవినీతి కేసు
  • క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేపట్టవద్దని సుప్రీం ఆదేశం
Big relief to Yediyurappa in corruption case

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పకు సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది. భూ కేటాయింపుల కుంభకోణానికి సంబంధించిన కేసులో క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేపట్టవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ అవినీతి కేసులో యెడ్డీపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేసేందుకు 2020లో కర్ణాటక హైకోర్టు నిరాకరించింది. ఆ సందర్భంగా హైకోర్టు జడ్జి జాన్ మైఖేల్ మాట్లాడుతూ, పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కేసు విచారణలో జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

2013లో యడియూరప్పపై ఈ కేసు నమోదయింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెల్లందూర్, దేవరబీసనహల్లి తదితర ప్రాంతాల్లో ఐటీ పార్క్ కోసం 400 ఎకరాల స్థలాన్ని సేకరించారు. అయితే ఈ భూమిలో కొన్ని భాగాలను ప్రైవేట్ ఓనర్లకు యెడ్డీ కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో ఆయనపై అవినీతి ఆరోపణలతో కేసు నమోదయింది. ఈ కేసుకు సంబంధించి క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేపట్టవద్దని ఈ రోజు సుప్రీంకోర్టు ఆదేశించడంతో 79 ఏళ్ల యడ్యూరప్పకు ఊరట లభించినట్టయింది.

More Telugu News