Solar Tsunami: సౌర సునామీ... రేపు భూవాతావరణాన్ని తాకే అవకాశం

Scientists says solar tsunami likely hit earth magnetic field
  • సూర్యుడి ఉపరితలంపై భారీ విస్ఫోటనం
  • భారీగా వెలువడుతున్న సౌరశక్తి తరంగాలు
  • భూ అయస్కాంత క్షేత్రాన్ని ఢీకొడతాయన్న శాస్త్రవేత్తలు
  • సూర్యుడి మధ్యలో పెద్ద రంధ్రం గుర్తింపు
మండుతున్న అగ్నిగోళం వంటి సూర్యుడిలో నిత్యం విస్ఫోటనాలు జరుగుతుంటాయి. వాటిలో కొన్ని అతి భారీ విస్ఫోటనాలు ఉంటాయి. వీటి నుంచి ఊహించనలవి కానంతటి శక్తి విడుదల అవుతుంది. వీటిని కరోనల్ మాస్ ఎజెక్షన్ (సీఎంఈ)గా పేర్కొంటారు. 

ఇలాంటిదే ఓ అత్యంత భారీ విస్ఫోటనం సూర్యుడిలో సంభవించినట్టు భారత శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని ప్రభావంతో సౌరశక్తి సునామీలా వెలువడుతోందని, ఇది రేపు (జులై 23) భూ వాతావరణాన్ని తాకనుందని వివరించారు. ఈ సౌర సునామీ తరంగాలు భూ అయస్కాంత క్షేత్రాన్ని అపరిమిత వేగంతో ఢీకొడతాయని తెలిపారు. 

ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కోల్ కతా సంస్థ నేతృత్వంలో ది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ స్పేస్ సైన్స్ ఇండియా సూర్యుడికి సంబంధించిన ఈ ప్రధానమైన మార్పును గుర్తించింది. సూర్యుడి మధ్యభాగంలో అతి పెద్ద రంధ్రాన్ని గురించి ఈ భారతీయ సంస్థలు కీలక సమాచారాన్ని సేకరించాయి. ఈ రంధ్రం నుంచి అమితవేగంతో సౌర తుపాను గాలులు వెలువడుతున్నాయని, ఇవి భూ అయస్కాంత క్షేత్రాన్ని తాకనున్నాయని భారతీయ పరిశోధకులు విశ్లేషించారు.
Solar Tsunami
Earth
Geomagnetic Storm
Magnetic Field

More Telugu News