Andhra Pradesh: ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో డిజిట‌ల్ డిస్‌ప్లేలు... ఉప‌క‌ర‌ణాల‌ను ప‌రిశీలించిన సీఎం జ‌గ‌న్‌

ap cm ys jagan examine digital displays
  • ఏపీలో నాడు- నేడుతో ప్ర‌భుత్వ విద్యాల‌యాల అభివృద్ది
  • కార్పొరేట్ స్కూళ్ల మాదిరి డిజిట‌ల్ క్లాసుల‌కు ఏర్పాట్లు
  • ఇప్ప‌టికే బైజూస్‌తో ఏపీ ప్ర‌భుత్వం ఒప్పందం
  • డిజిట‌ల్ డిస్‌ప్లేల‌పై ప‌రిశీల‌న చేస్తున్న సీఎం జ‌గ‌న్‌
ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం 'నాడు - నేడు' పేరుతో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు కొత్తరూపు తీసుకువస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయా పాఠ‌శాలల్లో మౌలిక స‌దుపాయాల‌ను అభివృద్ధి చేయ‌డంతో పాటు కార్పొరేట్ స్కూళ్ల మాదిరిగా డిజిట‌ల్ క్లాసుల నిర్వ‌హ‌ణ‌కు కూడా ప్ర‌భుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ఇప్ప‌టికే బైజూస్‌తో ఒప్పందం చేసుకున్న రాష్ట్ర ప్ర‌భుత్వం... ఆయా పాఠ‌శాల‌ల్లో డిజిట‌ల్ డిస్‌ప్లేల‌ను ఏర్పాటు చేసే ప‌నిలో నిమ‌గ్న‌మైంది.

ఇందులో భాగంగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఏ త‌ర‌హా డిజిట‌ల్ డిస్‌ప్లేల‌ను ఏర్పాటు చేస్తే బాగుంటుంద‌న్న విష‌యంపై సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దృష్టి సారించారు. శుక్ర‌వారం డిజిట‌ల్ డిస్‌ప్లేల‌ను త‌యారు చేస్తున్న ప‌లు కంపెనీలతో భేటీ అయిన ఆయ‌న‌... ఆయా కంపెనీల డిజిట‌ల్ డిస్‌ప్లేల‌ను ప‌రిశీలించారు.
Andhra Pradesh
YSRCP
YS Jagan
Nadu-Nedu
Govt Schools
Digital Classes

More Telugu News