ఏపీ సువర్ణావకాశాన్ని కోల్పోయింది: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

22-07-2022 Fri 14:42
  • రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము విజయం
  • ఎన్డీయే అభ్యర్థికి పూర్తి మద్దతు పలికిన ఏపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు
  • ఛత్రపతి శివాజీ వ్యాఖ్యలను ప్రస్తావించిన లక్ష్మీనారాయణ
VV Lakshmi Narayana comments on pending issues
ఏపీకి సంబంధించి అనేక డిమాండ్లు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉండడం పట్ల సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ లో స్పందించారు. నాడు ఛత్రపతి శివాజీ చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. 

"సింహగఢ్ కోటను చేజిక్కించుకున్న తర్వాత... కోటను గెలిచాం, కానీ సింహాన్ని (తానాజీ మాలుసరే) కోల్పోయాం అని ఛత్రపతి శివాజీ అన్నాడు. ఇప్పుడు మన ఎంపీలు, ఎమ్మెల్యేలు పూర్తి విధేయతతో ఎన్డీయే అభ్యర్థిని రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిపించారు. కానీ, పెండింగ్ డిమాండ్ల సాధన కోసం ఒత్తిడి తెచ్చే సువర్ణావకాశాన్ని ఏపీ కోల్పోయింది" అంటూ లక్ష్మీనారాయణ ట్వీట్ చేశారు.