చంద్రబాబు ప్రచారం కోసం పాకులాడతారు: ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్

22-07-2022 Fri 14:34
  • విశాఖ, విజయవాడ, తిరుపతికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయన్న  మంత్రి  
  • ఇన్ఫోసిస్ తరహా పరిశ్రమలు విశాఖకు రాబోతున్నాయని వెల్లడి 
  • వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆరుగురు మంత్రులు పర్యటిస్తున్నారన్న అమర్నాథ్ 
Gudivada Amarnath fires on Chandrababu
విశాఖ, విజయవాడ, తిరుపతికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ తెలిపారు. ఇన్ఫోసిస్ తరహా పెద్ద కంపెనీలు విశాఖకు రాబోతున్నాయని చెప్పారు. ప్రజలకు సేవ చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ప్రచారం కోసమే పాకులాడతారని విమర్శించారు. 

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆరుగురు మంత్రులు, ఎస్పీలు, అధికారులు, వాలంటీర్లు ఉన్నారని చెప్పారు. వరద బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 2 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని తెలిపారు. వరద బాధిత ప్రాంతాల్లో మంత్రులు పర్యటించడం లేదంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు.