Rashmika Mandanna: మరో భారీ ఆఫర్ కొట్టేసిన రష్మిక

Rashmika Mandanna to be paired opposite Chiyaan Vikram
  • చియాన్ విక్రమ్ సరసన హీరోయిన్ గా ఎంపిక
  • పా. రంజిత్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం
  • టైగర్ ష్రాఫ్ చిత్రానికి ఓకే చెప్పిన యువ నటి! 
తెలుగులో అగ్ర హీరోయిన్‌గా దూసుకెళ్తున్న రష్మిక మందన్న ‘పుష్ప’ తర్వాత ఇతర భాషల్లోనూ బిజీగా మారింది. హిందీతో పాటు తమిళంలోనూ వరుస అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం తమిళ హీరో విజయ్‌కి జంటగా ‘వారసుడు’ చిత్రంలో నటిస్తోందామె. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పుడు రష్మిక తమిళంలో మరో భారీ ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది. 

విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా పా.రంజిత్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్రకు రష్మికను సంప్రదించినట్టు తెలుస్తోంది. విక్రమ్‌ లాంటి పెద్ద హీరోతో కలిసి చేసే అవకాశం రావడంతో రష్మిక వెంటనే ఓకే చెప్పిందట. కేజీయఫ్ మైన్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ యాక్షన్ డ్రామాను త్రీడీలో రూపొందిస్తున్నారు.  

మరోవైపు బాలీవుడ్‌లోనూ రష్మిక ఓ కొత్త సినిమాకి ఓకే చెప్పిందని సమాచారం. టైగర్ ష్రాఫ్ హీరోగా శశాంక్ ఖేతన్ దర్శకతంలో కరణ్‌ జొహార్ నిర్మించనున్న ఈ చిత్రంలో రష్మికను హీరోయిన్‌గా తీసుకున్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. రష్మిక ఇప్పటికే బాలీవుడ్ లో రెండు చిత్రాల్లో నటించింది. అవి విడుదలకు సిద్ధం అవుతుండగా.. ‘యానిమల్’ అనే మూడో చిత్రంలోనూ నటిస్తోంది. ఇక రష్మిక కీలకపాత్ర పోషించిన తెలుగు చిత్రం ‘సీతారామం’ వచ్చే నెల 5న విడుదల కాబోతోంది.
Rashmika Mandanna
vikram
Tollywood
Kollywood
Bollywood
Pushpa

More Telugu News