YS Sharmila: అవగాహన లేకుండా ప్రాజెక్టులు కట్టి ఈ పరిస్థితి తీసుకొచ్చారు: కేసీఆర్ పై షర్మిల ఫైర్

  • రామగుండంలో వరద బాధితులను పరామర్శించిన షర్మిల
  • వరదలకు కేసీఆరే కారణమన్న షర్మిల
  • బాధితులకు రూ. 25 వేల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్
KCR is responsible for floods says YS Sharmila

పెద్దపల్లి జిల్లా రామగుండంలోని న్యూ పోరేడు పల్లి కాలనీలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు పర్యటించారు. కాలనీలోని వరద బాధితులను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా పలువురు తమ బాధలను షర్మిలతో మొరపెట్టుకున్నారు. ప్రభుత్వం ఇస్తానన్న పరిహారం ఇంకా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ, రామగుండంలో వరదలకు ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని చెప్పారు. అవగాహన లేకుండా ప్రాజెక్టులు కట్టి, ఈ పరిస్థితిని తీసుకొచ్చారని మండిపడ్డారు. 

వరద బాధితులకు పరిహారం ఇస్తామని ప్రభుత్వం మోసం చేసిందని... ఇంత వరకు నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రూ. 10 వేల నష్ట పరిహారం సరిపోదని.. రూ. 25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిహారాన్ని ప్రభుత్వ ఖజానా నుంచి కాకుండా టీఆర్ఎస్ పార్టీ ఖాతా నుంచి ఇవ్వాలని అన్నారు. టీఆర్ఎస్ అకౌంట్లో రూ. 860 కోట్లు ఉన్నాయని కేసీఆర్ చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు.

  • Loading...

More Telugu News