Karnataka: కాలేజీ విద్యార్థుల మధ్య ముద్దుల పోటీ.. పోలీసుల అదుపులో విద్యార్థి

Student Detained After Kissing Video Goes Viral In Karnataka
  • ఆరు నెలల క్రితం జరిగిన ఘటన
  • వారం రోజుల క్రితం వాట్సాప్‌లో షేర్ చేసిన యువకుడు
  • అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు
  • ఇద్దరినీ సస్పెండ్ చేసిన కాలేజీ యాజమాన్యం
కర్ణాటకలోని మంగళూరులో ఓ ప్రముఖ కళాశాలకు చెందిన ఓ జంట ఓ అపార్ట్‌మెంట్‌లో ముద్దుల్లో మునిగిపోయిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. కాలేజీ యూనిఫామ్‌లో ఉన్న వారిద్దరూ ముద్దు పెట్టుకుంటూ తన్మయత్వం చెందుతుండగా చుట్టూ ఉన్న వారి స్నేహితులు కేకలు వేస్తూ వారిని మరింతగా ప్రోత్సహిస్తుండడం ఆ వీడియోలో కనిపించింది. అది ముద్దుల పోటీ అని పోలీసులు తెలిపారు. ఈ వీడియో తీసిన యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు.  

అయితే, ఈ వీడియో ఇప్పటిది కాదని, ఆరు నెలల క్రితం నాటిదని మంగళూరు పోలీస్ కమిషనర్ ఎన్.శశికుమార్ తెలిపారు. వారం రోజుల క్రితం ఈ వీడియోను యువకుడు వాట్సాప్‌లో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కాలేజీ యాజమాన్యం వారిని హెచ్చరించి కాలేజీ నుంచి తొలగించింది. 

అయితే, ఈ ముద్దుల కాంపిటిషన్‌పై విద్యార్థుల తల్లిదండ్రులు కానీ, కాలేజీ యాజమాన్యం కానీ ఇప్పటి వరకు ఫిర్యాదు చేయలేదని కమిషనర్ తెలిపారు. కిస్సింగ్ కాంపిటిషన్ సందర్భంగా విద్యార్థులు ఏమైనా డ్రగ్స్ ఉపయోగించారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Karnataka
Kissing Competition
Mangaluru
Social Media

More Telugu News