ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్.. ఫైనల్‌కు దూసుకెళ్లిన నీరజ్ చోప్రా: వీడియో ఇదిగో

22-07-2022 Fri 08:29
  • అమెరికాలోని యుజీన్‌లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్
  • తొలి ప్రయత్నంలోనే 88.39 మీటర్లు విసిరిన నీరజ్
  • తుది పోరుపై అందరిలోనూ ఆసక్తి
Neeraj Chopra secured a World Championships mens javelin final berth
ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా మరోమారు సంచలనం సృష్టించాడు. అమెరికాలోని యుజీన్‌లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌ చేరుకున్నాడు. గ్రూప్-ఏ క్వాలిఫికేషన్ రౌండ్‌లో తొలి ప్రయత్నంలోనే 88.39 మీటర్ల దూరం విసిరి నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లాడు. 

ఇటీవల స్టాక్‌హోమ్‌లో జరిగిన డైమండ్ లీగ్‌లో 89.94 మీటర్ల దూరం విసిరి సరికొత్త జాతీయ రికార్డు సృష్టించిన నీరజ్.. 90 మీటర్ల దూరానికి 6 సెంటీమీటర్ల దూరంలో నిలిచాడు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఫైనల్‌పైనే ఉంది. తుదిపోరులో అతడు ఎంతదూరం జావెలిన్ విసురుతాడనే దానిపై అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి.