Naga Chaitanya: మీరంతా కలిసి నాకే ఓ సెల్ఫీ ఇవ్వండి: చైతూ

Thank you movie update
  • 'థ్యాంక్యూ' ప్రమోషన్స్ తో బిజీగా చైతూ 
  • స్టూడెంట్స్ తో కలిసి చేసిన సందడి
  • సెల్ఫీల కోసం ఎగబడిన స్టూడెంట్స్ 
  • రేపు విడుదలవుతున్న సినిమా  
నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' సినిమా రూపొందింది. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ 'కేఎల్ యూనివర్సిటీ'లో మ్యూజికల్ కన్సర్ట్ ను నిర్వహించింది.

ఈ ఫంక్షన్ లో చైతూకి చాలామంది అమ్మాయిలు ఐ లవ్ యూ చెబుతూ హడావిడి చేశారు. రాశి ఖన్నా గురించి చెప్పమని పట్టుబట్టారు. ఆయనతో సెల్ఫీ తీసుకోవడానికి ఎగబడ్డారు. దాంతో తానే స్టేజ్ పై నుంచి వాళ్లందరితో సెల్ఫీ తీసుకుంటానని చైతూ అన్నాడు. అదే విధంగా వారితో ఒక సెల్ఫీ తీసుకున్నాడు.

రేపు ఈ సినిమా చూడటానికి తమ కాలేజ్ కి సెలవు ఇప్పించమని పట్టుబట్టారు. అది మాత్రం తన చేతుల్లో లేదని చైతూ తప్పించుకున్నాడు. అక్కడి స్టూడెంట్స్ ఆయనతో కలిసి డాన్స్ చేయాలని ముచ్చటపడ్డారు. దాంతో వాళ్లతో కలిసి చైతూ డాన్స్ చేశాడు. విడుదలకు ముందు చైతూ బాగానే సందడి చేశాడు. ఇక ఈ సినిమా థియేటర్స్ లో ఎలా సందడి చేస్తుందన్నది చూడాలి.
Naga Chaitanya
Rashi Khanna
Vikram Kumar
Thank You Movie

More Telugu News