రికార్డుస్థాయిలో దూసుకుపోతున్న అంజలి ఐటమ్ సాంగ్!

  • నితిన్ హీరోగా రూపొందిన 'మాచర్ల నియోజకవర్గం'
  • పొలిటికల్ యాక్షన్ ఎంటర్టయినర్ జోనర్లో సాగే కథ 
  •  సంగీత దర్శకుడిగా మహతి స్వరసాగర్ 
  • ఆగస్టు 12వ తేదీన సినిమా విడుదల
Macharla Niyojakavargam movie update

నితిన్ హీరోగా 'మాచర్ల నియోజక వర్గం' సినిమా రూపొందింది. నితిన్ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాతో దర్శకుడిగా రాజశేఖర్ రెడ్డి పరిచయమవుతున్నాడు. నితిన్ సరసన కథానాయికలుగా కృతి శెట్టి .. కేథరిన్ అలరించనున్నారు. పొలిటికల్ టచ్ తో కూడిన యాక్షన్ ఎంటర్టయినర్ జోనర్లో ఈ సినిమా రూపొందింది. 

ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా నుంచి ఇటీవల వదిలిన 'రారా రెడ్డి' అనే పాటకి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. అంజలిపై చిత్రీకరించిన ఈ ఐటమ్ సాంగ్, యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ఇంతవరకూ 20 మిలియన్ ప్లస్ వ్యూస్ ను .. 300K లైక్స్ ను ఈ పాట సంపాదించుకుంది. 

కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను 'లిప్సిక' ఆలపించింది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ మాస్ ను ఆకట్టుకునేలా ఉంది. ప్రత్యేకంగా వేసిన సెట్లో చిత్రీకరించిన ఈ పాట ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఆగస్టు 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News