వ‌ర‌ద నీటిలో లైఫ్ జాకెట్‌తో చంద్ర‌బాబు ప్ర‌యాణం... వీడియో ఇదిగో

21-07-2022 Thu 16:47
  • వ‌ర‌ద బాధితుల ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరిన చంద్ర‌బాబు
  • ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా  అయోధ్య‌లంక చేరిన టీడీపీ అధినేత‌
  • వ‌ర‌ద నీటిలోనే బాధితుల ప‌రామ‌ర్శ  
chandrababu wears life jacker in flood affected areas
ఏపీలో ఇటీవల కురిసిన వర్షాల‌తో గోదావ‌రి ప‌రీవాహ ప్రాంతాలు నీట మునిగిన సంగ‌తి తెలిసిందే. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను ఏపీ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవడం లేద‌ని ఆరోపించిన టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు తాజాగా గురువారం వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరారు. వ‌ర‌ద‌ల‌తో స‌ర్వం కోల్పోయిన బాధితుల‌కు భ‌రోసా అందించేందుకే తాను ఈ ప‌ర్య‌ట‌న‌కు వెళుతున్న‌ట్లు చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. గురు, శుక్ర‌వారాల్లో చంద్ర‌బాబు వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. 

ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా గురువారం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ప‌రిధిలోని అయోధ్య లంక‌కు చంద్ర‌బాబు చేరుకున్నారు. గోదావ‌రిలో వ‌ర‌ద ఉద్ధృతి త‌గ్గినా... గ్రామాల్లోని వ‌ర‌ద నీరు ఇంకా పూర్తిగా తొల‌గిపోలేదు. ఈ క్ర‌మంలో ఆయా ప్రాంతాల్లో ప‌ర్య‌టించాలంటే.. బోటును త‌ప్ప‌నిస‌రిగా వినియోగించాల్సిందే. ప‌రిస్థితికి త‌గ్గట్టుగా స్పందించిన చంద్ర‌బాబు... లైఫ్ జాకెట్ తొడుక్కుని బోటులోనే వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు బ‌య‌లుదేరారు. ఈ వీడియోను టీడీపీ త‌న సోష‌ల్ మీడియా ఖాతాల వేదిక‌గా పంచుకుంది.