కరోనా కేసులు పెరుగుతున్నాయి.. బూస్టర్ డోసులు వేగవంతం చేయండి: హరీశ్ రావు

21-07-2022 Thu 14:47
  • తెలంగాణలో క్రమంగా పెరుగుతున్న కేసులు
  • వైద్య సిబ్బంది అలర్ట్ గా ఉండాలన్న హరీశ్ రావు
  • ఎంపీలు, ఎమ్మెల్యేల సహకారాన్ని తీసుకోవాలని సూచన
Minister Harish Rao orders to Speed up booster dose vaccination
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తెలంగాణలో సైతం కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాల వైద్యాధికారులతో ఆరోగ్య మంత్రి హరీశ్ రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది అలర్ట్ గా ఉండాలని ఆయన చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బూస్టర్ డోసుల పంపిణీని వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారాన్ని వైద్య అధికారులు, సిబ్బంది తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రుల్లో సరిపడా మందులు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.