Chandrababu: పోలవరంను రివర్స్ గేర్ లో వెనక్కి తీసుకెళ్తున్నారు: చంద్రబాబు

YSRCP govt taking back polavaram project in reverse gear says Chandrababu
  • ఏపీని వైసీపీ ప్రభుత్వం మరో శ్రీలంకలా మారుస్తోందన్న చంద్రబాబు 
  • శ్రీలంక ప్రజల కంటే ఏపీ ప్రజలకు ఓర్పు ఎక్కువని వ్యాఖ్య 
  • అందుకే వైసీపీ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడం లేదన్న బాబు 
ఏపీని వైసీపీ ప్రభుత్వం మరో శ్రీలంకలా మారుస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. మన దేశంలో అధిక ధరలకు చిరునామా ఏపీ అని అన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ అప్పులు చేసింది కూడా ఏపీ ప్రభుత్వమేనని చెప్పారు. శ్రీలంక ప్రజల కంటే ఏపీ ప్రజలకు ఓర్పు ఎక్కువని... అందుకే ప్రభుత్వంపై తిరుగుబాటు చేయలేదని అన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమంతో ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. 

పోలవరం ప్రాజెక్టును రివర్స్ గేర్ తో వెనక్కి తీసుకెళ్తున్నారని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈరోజు చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆచంట నియోజకవర్గం ఇలపర్రు వద్ద స్థానికులు ఆయన కాన్వాయ్ ని ఆపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.
Chandrababu
Telugudesam
YSRCP
Andhra Pradesh
Sri Lanka
Polavaram Project

More Telugu News