ఆగస్ట్ 25న ఇండియా షేక్ అవుతుంది: విజయ్ దేవరకొండ

21-07-2022 Thu 14:05
  • హైదరాబాద్ లో ఘనంగా జరిగిన 'లైగర్' ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం
  • ఎంతో కష్టపడి సినిమా చేశానన్న విజయ్ దేవరకొండ
  • సినిమాను అభిమానులకు అంకితం చేస్తున్నానన్న విజయ్
India will shake on August 25 says Vijay Devarakonda
విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'లైగర్' సినిమా వచ్చే నెల 25న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ భారీ ఎత్తున నిర్వహిస్తోంది. సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం ఈ ఉదయం హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హీరోయిన్ అనన్య పాండేతో పాటు బాలీవుడ్ నిర్మాత కరణ్ జొహార్ కూడా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, మీ అందరినీ ఉద్దేశించి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదని చెప్పాడు. తన మునుపటి సినిమా విడుదలై రెండేళ్లు అవుతోందని... అది కూడా అంత గొప్పగా ఆడలేదని అన్నారు. ఈరోజు ట్రైలర్ కు వస్తున్న స్పందన చూస్తుంటే ఏం చెప్పాలో తెలియడం లేదని చెప్పాడు. ఈ చిత్రాన్ని అభిమానులకు అంకితం చేస్తున్నానని తెలిపారు. మీరందరూ గర్వంగా ఫీల్ అవ్వాలనే ఎంతో కష్టపడి సినిమా చేశానని అన్నాడు. ఆగస్ట్ 25న థియేటర్లు అన్నీ నిండిపోవాలని చెప్పాడు. ఆరోజు ఇండియా షేక్ అవుతుందని అన్నాడు.