బోట్ నుంచి ఒకేసారి ఆరు గ్యాడ్జెట్లు

  • రెండు స్మార్ట్ వాచ్ లు ఆవిష్కరణ
  • సౌండ్ బార్, ఇయర్ బడ్స్ సైతం
  • అమెజాన్ ప్రైమ్ డే సేల్ కు ముందే విడుదల
boAt launches six new products including soundbar earbuds and smartwatch

ప్రముఖ వేరబుల్ డివైజెస్ కంపెనీ బోట్.. ఒకేసారి ఆరు రకాల గ్యాడ్జెట్లను విడుదల చేసింది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ కు ముందుగానే వీటిని తీసుకొచ్చేసింది. వీటిల్లో మూడు ఇయర్ బడ్స్ కాగా, ఒకటి సౌండ్ బార్. రెండు స్మార్ట్ వాచ్ లు ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఈ నెల 23, 24 తేదీల్లో జరగనుంది. కొత్త చందాదారులను ఆకర్షించేందుకు భారీ ఆఫర్లతో అమెజాన్ ఏటా దీన్ని నిర్వహిస్తుంటుంది. 


బోట్ రాకర్ 330 ఏఎన్ సీ నెక్ బ్యాండ్ ను క్రిస్టల్ బయోనిక్ సౌండ్ టెక్నాలజీతో తయారు చేసింది. మంచి ఆడియో అనుభవాన్ని ఇస్తుందని 25డీబీ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కూడా ఉందని కంపెనీ ప్రకటించింది. అవంటే బార్ ఒపెరా అన్నది సౌండ్ బార్. ఇందులో అలెక్సా సపోర్ట్ బిల్ట్ ఇన్ గా వస్తుంది. 120 వాట్ ఆర్ఎంఎస్ బోట్ సిగ్నేచర్ సౌండ్ సిస్టమ్ తో వస్తుంది.

ఇక ఎయిర్ డాప్స్ 413 ఏఎన్ సీ స్పష్టమైన వాయిస్ డెలివరీ చేస్తాయని బోట్ ప్రకటించింది. వీటిని కంప్లీట్ ఆల్ రౌండర్ గా పేర్కొంది. వీటిల్లోనూ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉంది. 20 గంటల బ్యాటరీ బ్యాకప్ తో వస్తాయి. ఎయిర్ డాప్స్ 121 ప్రో పేరుతో మరో ఇయర్ డాప్స్ ను కూడా బోట్ విడుదల చేసింది. దీని ధర రూ.1,299. ఇది ఒక్కసారి చార్జ్ చేస్తే 40 గంటల పాటు ప్లే టైమ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. 

ఎక్స్ టెండ్ ప్రో స్మార్ట్ వాచ్ 1.78 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే, 700కు పైగా యాక్టివ్ మోడ్స్, 100కు పైగా వాచ్ ఫేసెస్, 30 నిమిషాల్లోనే చార్జ్ చేసుకోగలగడం, ఒక్క చార్జ్ తో 10 రోజుల పాటు పనిచేయగలగడం, ఐపీ 68 వాటర్ రెసిస్టెన్స్, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లు ఉన్నాయి. వేవ్ కాల్ పేరుతో మరో స్మార్ట్ వాచ్ ను కూడా బోట్ తీసుకొచ్చింది. ఇందులో 1.69 అంగుళాల డిస్ ప్లే, 550 నిట్స్ బ్రైట్ నెస్, చాలా వరకు స్పోర్ట్స్ మోడ్ లు ఉన్నాయి.

More Telugu News