హాలీవుడ్ లో భారీగా పారితోషికం తీసుకునే నటులు వీరే!

  • రూ.800 కోట్లతో టామ్ క్రూజ్ సరికొత్త రికార్డ్
  • ‘టాప్ గన్: మ్యావరిక్’ సినిమా రూపంలో అతడిపై కనక వర్షం
  • రెండో స్థానంలో విల్ స్మిల్
  • ఎమాన్సిపేషన్ సినిమా కోసం రూ.280 కోట్లు
Highest paid actors of 2022 Tom Cruise banks over 100 million dollars

టామ్ క్రూజ్ హాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. టాప్ గన్: మ్యావరిక్ సినిమాకు అతడు అందుకునే మొత్తం 100 (రూ.800 కోట్లు) మిలియన్ డాలర్లకు పైనే ఉండనుంది. ఈ సినిమాకు టామ్ క్రూజ్ సహ నిర్మాతగానూ వ్యవహరించాడు. దీంతో అతడికి ఈ సినిమా రూపంలో రూ.800 కోట్లకు పైనే లభించనుంది. ఈ ఏడాది మే నెలలో ఈ సినిమా విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 1.2 బిలియన్ డాలర్లు (రూ.9,600 కోట్లు) వసూలు చేసింది. టామ్ క్రూజ్ కు చెందిన ఓ సినిమా బిలియన్ డాలర్ల వసూళ్లను అందుకోవడం ఇదే మొదటిసారి.


ఇక అత్యధిక పారితోషికం తీసుకునే రెండో హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్. త్వరలో రానున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఎమాన్సిపేషన్ కోసం అతడు 35 మిలియన్ డాలర్లు (రూ.280 కోట్లు) తీసుకున్నాడు. ఆ తర్వాత లియోనార్డో డికాప్రియో మార్టిన్ ‘కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్’  సినిమా కోసం 30 మిలియన్ డాలర్లు (రూ.240 కోట్లు) అందుకున్నాడు. ఇంకా టైటిల్ నిర్ణయించని, త్వరలో విడుదలయ్యే సినిమా కోసం బ్రాడ్ పిట్ సైతం 30 మిలియన్ డాలర్లు పొందాడు. క్రిస్ హెమ్స్ వర్త్ (ఎక్స్ ట్రాక్షన్ 2 సినిమా), డెంజెల్ వాషింగ్టన్ (ఈక్వలైజర్ 3), విన్ డీజెల్ (ఫాస్ట్ ఎక్స్), జోక్విన్ ఫినిక్స్ (జోకర్ 2), టామ్ హార్డీ (వీనమ్ 3), విల్ ఫెర్రెల్, రేనాల్డ్స్ 20 మిలియన్ డాలర్లకు (రూ.160కోట్లు)పైనే రెమ్యునరేషన్ తీసుకున్నారు.

More Telugu News