విజయ్ దేవరకొండ కటౌట్ కు అభిమానుల క్షీరాభిషేకం
- సుదర్శన్ థియేటర్ లో ట్రైలర్ విడుదల కార్యక్రమం
- హాజరైన విజయ్ దేవరకొండ, అనన్య పాండే, పూరీ జగన్నాథ్
- థియేటర్ ముందు భాగంలో విజయ్ దేవరకొండ భారీ కటౌట్
కొందరు యువకులు ఈ కటౌట్ కు పాలతో అభిషేకం నిర్వహించి.. పూలు చల్లుతూ.. తమ అభిమానం చాటుకున్నారు. లైగర్ లో విజయ్ దేవరకొండ మాదిరే కొందరు అభిమానులు షర్ట్ లేకుండా కనిపించారు. చేతులు, వీపు భాగాల్లో లైగర్ పేరు పెయింట్ వేసుకుని దర్శనమిచ్చారు. పూరీ జగన్నాథ్, అనన్య పాండే ట్రైలర్ విడుదల కార్యక్రమంలో సందడి చేశారు.