శ్రీలంకలో దిగ్భ్రాంతికర పరిస్థితులు... నిత్యావసర వస్తువుల కోసం శరీరాలను అమ్ముకుంటున్న మహిళలు!

  • శ్రీలంకలో ప్రజల పరిస్థితి దయనీయం
  • అత్యంత తీవ్రంగా ఆర్థిక సంక్షోభం
  • మూతపడిన కంపెనీలు, పరిశ్రమలు
  • ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయిన మహిళలు
  • కుటుంబ పోషణ కోసం వేశ్యలుగా మారుతున్న వైనం
Most painful situations in Sri Lanka

తీవ్ర అస్థిరత, రాజకీయ సంక్షోభం, అధిక ద్రవ్యోల్బణం నెలకొన్న శ్రీలంకలో దిగ్భ్రాంతికర పరిస్థితులు కనిపిస్తున్నాయి. పిల్లల కడుపు నింపేందుకు అక్కడి మహిళలు వ్యభిచారం బాట పడుతున్నట్టు వెల్లడైంది. ఆర్థిక సంక్షోభం అంతకంతకు అధికం కావడంతో ఉద్యోగాలు కోల్పోయిన మహిళలు చేసేది లేక సెక్స్ వర్కర్లుగా మారుతున్నారు. 

కొందరైతే నిత్యావసర వస్తువుల కోసం దుకాణాదారులకు తమ శరీరాలు అప్పగిస్తున్న సంఘటనలు కూడా శ్రీలంకలో చోటుచేసుకుంటుండడం అత్యంత దయనీయం. శ్రీలంకలో ఇప్పుడు కిలో టమోటాలు కొనాలంటే రూ.200 పైమాటే. కిలో క్యారెట్ రూ.490, కిలో మిర్చి రూ.700 పలుకుతోంది. ఇక గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల సంగతి అటుంచితే లభ్యం కావడమే గగనమైపోయింది. కనీసం చంటిబిడ్డలకు పాలపొడి కూడా దొరక్క అలమటిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో, గత కొన్నినెలలుగా లంకలో వ్యభిచారం చేసే స్త్రీల సంఖ్య 30 శాతం పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. కుటుంబ పోషణకు తమకు అంతకంటే వేరేమార్గం కనిపించడంలేదని, గత్యంతరం లేకనే వేశ్యగా మారాల్సి వచ్చిందని ఓ మహిళ కన్నీటిపర్యంతమైంది. విస్మయం కలిగించే విషయం ఏంటంటే.... నూతనంగా వెలిసిన వ్యభిచార గృహాలకు పోలీసులు కూడా సహకారం అందిస్తున్నారట.

More Telugu News