Ram Gopal Varma: నిర్మాత శేఖర్ రాజుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma complains to police on producer Sekhar Raju
  • కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి తన సినిమాను శేఖర్ రాజు ఆపించారన్న వర్మ
  • శేఖర్ రాజే తనకు డబ్బులు ఇవ్వాలని వ్యాఖ్య
  • శేఖర్ రాజుపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరానన్న ఆర్జీవీ
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం 'లడ్కీ: ఎంటర్ ది గర్ల్ డ్రాగన్'. అయితే, ఈ సినిమా విడుదలకు బ్రేక్ పడింది. సినిమా ప్రదర్శనను ఆపేయాలంటూ హైదరాబాదులోని సివిల్ కోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో, సినీ నిర్మాత శేఖర్ రాజుపై ఆర్జీవీ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో వర్మ మాట్లాడుతూ... శేఖర్ రాజే తనకు డబ్బులు ఇవ్వాలని చెప్పారు. 'లడ్కీ' సినిమాపై తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టును తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. శేఖర్ రాజుకు తాను ఇవ్వాల్సింది ఏమీ లేదని చెప్పారు. తప్పుడు సమాచారంతో తన సినిమాను నిలుపుదల చేయించిన శేఖర్ రాజుపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరానని తెలిపారు. సినిమాపై ఆధారపడి ఎంతో మంది బతుకున్నారని... సినిమా ఆగిపోతే అందరికీ నష్టమేనని చెప్పారు.
Ram Gopal Varma
Sekhar Raju
Ladki Movie
Police

More Telugu News